దేవా నీ సన్నిధిలో
Daevaa Nee Sannidhilo
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 3/2/2023
Lyrics
దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము – ||దేవా|| అపరాధులగు నీదు ప్రజల నెపములన్నియు బాపి కృపాళుండగు యేసు ప్రభువా కృపను జూపి రక్షించుమయా ||దేవా|| చేసి యున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి మోసములలో బడియున్నాము యేసుప్రభు జయమునిమ్ము ||దేవా|| లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ము నీ వాక్యముచే ||దేవా|| నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రమాణికులన్ శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువ ||దేవా|| సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు ||దేవా||