దేవాది దేవా

Daevaadi Daevaa

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 11/9/2024

Lyrics

దేవాది దేవా ప్రభువుల ప్రభూ
రాజుల రాజా హల్లెలూయ
నీ రక్తముతో విమోచించి
నీ రక్తముతో సంపాదించి
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి
పరలోక పాటన్ నా కొసగితివి
(2)         ||దేవాది దేవా||
జీవిత నావలో తుఫాను రేగ
భయపడకుడని అభయము నిచ్చి
జయప్రదముగా నన్ను నడిపించి
జయజీవితము నా కొసగుచున్న
(2)         ||దేవాది దేవా||
పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి
కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి
అరమర లేక నన్నాదరించి
పరలోక దర్శనంబిచ్చితివి
(2)         ||దేవాది దేవా||
మరణ పాత్రులం యిద్ధరణిలోన
దురిత ఋణముల స్మరణను మాన్పి
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము
నీ రాజ్యమందు రాజులన్ జేసి
(2)         ||దేవాది దేవా||
శోధనగాధల కష్టములలో
నా దుఃఖములలో నే నేడ్వకుండా
నీ దయ నాపై నిండార నింపి
ఓదార్చి నన్ను నీ దారినడుపు
(2)         ||దేవాది దేవా||
ప్రతి వత్సరము దయతోడ నింపున్
ప్రభు జాడలు సారము జల్లున్
ప్రతి బీడునూ సారము చిలకన్
ప్రతి పర్వతము ఆనందించున్
(2)         ||దేవాది దేవా||
పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట
సర్వశక్తిగల క్రీస్తుని యెదుట
పరలోక నూతన గీతము పాడ
జేర్చితివి నన్ నీ జనమునందు
(2)         ||దేవాది దేవా||

Video