దేవాది దేవుడు

Daevaadi Daevudu

UncategorizedAdded on 2/17/2018

Lyrics

దేవాది దేవుడు మహోపకారుడు
మహాత్యము గల మహారాజు
ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
ఆయన కృప నిరంతరముండును
||దేవాది||
సునాద వత్సరము ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము
ఉత్తమ దేవుని దానములు
(2)       ||దేవాది||
యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు
జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే
నీదు క్రియలు ఘనమైనవి
(2)       ||దేవాది||
అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు
మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును
సదా నీకే కలుగును గాక
(2)       ||దేవాది||

Video