దేవుడే ఇల చేరేటందుకు
Daevudae Ila Chaeraetmduku
Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 5/3/2020
Lyrics
దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2) ||దేవుడే|| కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం మోషేగా మారిన పసివాడిని దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం ||అమ్మా|| సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం హన్నా చేసిన ఆ త్యాగమే కాదా సమూయేలు పొందిన న్యాయాధిపత్యము సమూయేలు పొందిన న్యాయాధిపత్యము ||అమ్మా|| కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం ||అమ్మా||