దేవుడొక నగరము

Daevudoka Nagaramu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 12/29/2021

Lyrics

దేవుడొక నగరము మన కొరకై
సిద్ధపరచుచుండె నుండుటకై
మనము వెళ్ళెదం నిశ్చయముగా
(2)        ||దేవుడొక||
మేలిమి బంగారము అద్భుత నగరం
విలువైన రాళ్ళతో పునాది వేసెను
రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా
(2)        ||దేవుడొక||
నగర ప్రాకారములు ఎత్తైనవి
సూర్య కాంతములచే కట్టబడెను
ప్రభువే విమోచించి అధికారమిచ్చెను
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా
(2)        ||దేవుడొక||
ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు
పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి
పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా
(2)        ||దేవుడొక||
ఆ నగర వీధులు మేలిమి బంగారం
ద్వారములు ఎప్పటికి మూయబడవు
ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా
(2)        ||దేవుడొక||
గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును
ఆయనే దీపము నాలయమై యుండును
జీవగ్రంథమందున పేరులున్నవనుచు
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా
(2)        ||దేవుడొక||
జయవంతుల కొరకే ఆ నగరం
పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు
విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే
మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా
(2)        ||దేవుడొక||

Video