దేవుడు నీకు తెలుసు
Daevudu Neeku Thelusu
UncategorizedAdded on 11/7/2016
Lyrics
నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి అవసరాలకు దేవుని నమ్మక ఆత్మకు తండ్రని నమ్మాలి నీ ఆత్మకు తండ్రని నమ్మాలి ||దేవుడు|| నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక నలు దిక్కులకు సువార్తను ప్రకటించు ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక పాపిని రక్షించు పరలోకానికి నడిపించు నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు ||దేవుడు|| నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు దేహానికిష్టమైనది అడగకూడదు ముందు ||దేవుడు||