దేవుని సముఖ జీవ కవిలెలో
Daevuni Samukha Jeeva Kavilelo
UncategorizedAdded on 9/27/2016
Lyrics
జోసఫ్ జె కళ్యాణపు దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే హత సాక్షుల కవిలెలో నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన విజయవీరుల కవిలెలో నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు సర్వోన్నతుని పురములలో నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన ప్రార్ధన వీరుల కవిలెలో నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా పరిశుద్ధుల కవిలెలో నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||