దేవుని స్తుతియించి ఆరాధింతుము
Daevuni Sthuthiyimchi Aaraadhimthumu
Lyricistమధు
UncategorizedAdded on 5/12/2017
Lyrics
దేవుని స్తుతియించి ఆరాధింతుము మన దేవుని ఆరాధించి ఆనందింతుము రండీ ఓ జనులారా సర్వలోక నివాసులారా సంతోషగీతము పాడెదము ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2) ||దేవుని|| వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు ఆయనే రక్షించును ||రండీ ఓ|| బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను శత్రువుల చెర నుంచి విడిపించెను తోడుండి నడిపించెను ||రండీ ఓ|| మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును వేదనలు శోధనలు ఎదిరించగా శక్తిని మనకిచ్చునూ ||రండీ ఓ|| కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా దిగులే మనకెందుకు ||రండీ ఓ||