దేవుని స్తుతియించుడి
Daevuni Sthuthiyimchudi
Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 11/5/2013
Lyrics
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆ… ఆ… ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకశవిశాలమందు ఆ… ఆ… ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి ఆయన ప్రభావమును ఆ… ఆ… ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలములతో ఆ… ఆ… ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను చక్కని స్వరములతో ఆ… ఆ… ||ఎల్లప్పుడు|| తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతో ఆ… ఆ… ||ఎల్లప్పుడు|| పిల్లనగ్రోవుల చల్లగనూది ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… ||ఎల్లప్పుడు|| మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి గంభీర తాళముతో ఆ… ఆ… ||ఎల్లప్పుడు|| సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… ||ఎల్లప్పుడు||