దేవుని వారసులం
Daevuni Vaarasulm
Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 7/21/2016
Lyrics
దేవుని వారసులం – ప్రేమ నివాసులము జీవన యాత్రికులం – యేసుని దాసులము నవ యుగ సైనికులం – పరలోక పౌరులము హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము ||దేవుని|| సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే విజేత ప్రేమికులం – విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదుము (2) ||దేవుని|| ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదుము (2) ||దేవుని|| దారుణ హింస లలో – దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో – ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము (2) ||దేవుని|| పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక – బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగ హోమము జేయుదము (2) ||దేవుని|| అనుదిన కూటములు – అందరి గృహములలో ఆనందముతోను – ఆరాధనలాయే వీనుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము (2) ||దేవుని|| హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర భీతులలో బహు రీతులలో నూతన లోకము కాంక్షింతుము (2) ||దేవుని||