దేవునికే మహిమ
Daevunikae Mahima
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 7/18/2019
Lyrics
దేవునికే మహిమ యుగయుగములు కలుగును గాక (2) ||దేవునికే|| దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో దానికి మనలను వారసుల జేసెను వందనములు చెల్లింతుము (2) ||దేవునికే|| నిలవరమైనది మనకిల లేదని వల్లభుడు స్థిరపరచెను పరమందు చెల్లించి స్తుతులను పూజింతుము (2) ||దేవునికే|| సీయోను పురమగు దేవుని నగరుకు సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే స్తోత్ర గీతములను పాడెదము (2) ||దేవునికే|| శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను ముదమారగను ప్రణుతింతుము (2) ||దేవునికే||