దేవునియందు నిరీక్షణ నుంచి

Daevuniymdu Nireekshana Numchi

UncategorizedAdded on 9/27/2016

Lyrics

దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా
ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు
(2)      ||దేవుని||
చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు – జీవమగు – మార్గమేసే
(2)      ||దేవుని||
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే
ఆధారము – ఆదరణ – ఆయనలో
(2)      ||దేవుని||
తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు
(2)      ||దేవుని||
నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు – మిత్రులుగా – మారుదురు
(2)      ||దేవుని||
పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర – సంపన్నుడు – నా దేవుడు
(2)      ||దేవుని||
స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
(2)      ||దేవుని||

Video