ధన్యము ఎంతో ధన్యము
Dhanyamu Emtho Dhanyamu
UncategorizedAdded on 9/26/2016
Lyrics
ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము|| ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు|| క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు|| ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2) ||వారె ధన్యులు|| ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును అపవాది తంత్రములు – గుర్తించు వారును (2) ||వారె ధన్యులు|| శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2) ||వారె ధన్యులు||