ధ్యానించుచుంటిమి
Dhyaanimchuchumtimi
Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 4/1/2021
Lyrics
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు మోక్షమునకు చేర్చు బాటలు పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్టుడా… ||ధ్యానించుచుంటిమి|| తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము అని ప్రార్ధన చేసావా బాధించే వారికి శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో|| నేడే నాతోను పరదైసులో నీవుందువు నిశ్చయముగ ప్రవేశింతువు అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి అధికారముతో పాపిని రక్షించి (2) ||పరిశుద్ధతలో|| ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎప్పుడు అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2) ||పరిశుద్ధతలో|| దేవా నా దేవా నను విడనాడితివెందుకు చెవినీయవె నా ప్రార్థనకు అని కేక వేసావా శిక్షననుభవిస్తూ పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2) ||పరిశుద్ధతలో|| సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని వాక్యము నెరవేర్చుచుంటిని అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు జీవ జలమును అనుగ్రహించుటకు (2) ||పరిశుద్ధతలో|| సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం నెరవేరెను ఘన సంకల్పం అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2) ||పరిశుద్ధతలో|| నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని నీ యొద్దకు వచ్చుచుంటిని అని విన్నవించావా విధేయత తోటి తల వంచి తృప్తిగ విజయము చాటి (2) ||పరిశుద్ధతలో||