దిక్కులన్ని నీవేలే
Dikkulanni Neevaelae
UncategorizedAdded on 2/6/2017
Lyrics
ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ నిత్యమై నాలోన – జీవమై నీవుండ ||దిక్కులన్ని|| లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే ||దిక్కులన్ని|| దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట హీనమైన రూపానాన – గానమై యేసన్న ||దిక్కులన్ని||