దినదినంబు యేసుకు
Dinadinmbu Yaesuku
Lyricistవిద్యార్ధి గీతావళి
UncategorizedAdded on 2/6/2017
Lyrics
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు|| మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు|| ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు|| దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు|| పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు||