దినమెల్ల నే పాడినా
Dinamella Nae Paadinaa
UncategorizedAdded on 2/1/2015
Lyrics
ప్రభు భూషణ్ ప్రత్తిపాటి దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ||దినమెల్ల|| గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిను విడువనూ ఎడబాయననినా నా యేసయ్య ||దినమెల్ల|| నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని ||దినమెల్ల||