దివి నుండి భువికి

Divi Numdi Bhuviki

UncategorizedAdded on 12/15/2021

Lyrics

ఎం యేసు పాల్
దివి నుండి భువికి రారాజుగా
బేత్లెహేము పురముకు ఏతెంచెను
గ్రామమంతా చిరునవ్వు లొలికె
పట్టణమంతా పండుగ చేసె
సర్వలోకము సంబరమాయె
ఆశ్చర్యకరుడు హల్లెలూయ
ఆలోచనకర్త హల్లెలూయ
బలమైన దేవుడు హల్లెలూయ
నిత్యుడగు తండ్రి హల్లెలూయ
సమాధానకర్త హల్లెలూయ
గొల్లలు జ్ఞానులు పరవశులై
బంగారం సాంబ్రాణి బోళమును
సాష్టాంగపడి తమ హృదయములన్
ప్రభువుకు కానుకలర్పించిరి
మనము కూడా అర్పించెదం
ప్రభువు నామము ఘనపరచెదం
మనము కుడా సాష్టాంగపడుచు
పరవశించుచు పాడెదము
||ఆశ్చర్యకరుడు||
పాపము శాపము బాపగను
వేదన శోధన తీర్చగను
పరిశుద్ధుడు జన్మించెనని
ఇహమున పరమున కొనియాడెదం
మనము కూడా కొనియాడెదం
ప్రభువు నామం ఘనపరచెదం
మనము కూడా హోసన్నయనుచు
కరములెత్తి పాడెదము
||ఆశ్చర్యకరుడు||
||గ్రామమంతా||

Video