దివినేలు స్తోత్రార్హుడా

Divinaelu Sthothraarhudaa

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 3/27/2017

Lyrics

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా
దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా
మొదటివాడవు – కడపటివాడవు
యుగయుగములలో ఉన్నవాడవు
మానక నా యెడల కృప చూపుచున్నావు
మారదు నీ ప్రేమ తరతరములకు
మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు
నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఊటలు
నీ కృపలే బలమైన కోటలు
(2)       ||దివినేలు||
దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు
దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు
దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు
దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు
నీ దీవెన పరిమళ సువాసన
నీ ఘనతే స్థిరమైన సంపద
(2)       ||దివినేలు||
సీయోను శిఖరముపై నను నిలుపుటకే
జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే
దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు
సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు
నీ రాజ్యము పరిశుద్ధ నగరము
ఆ రాజ్యమే నిత్య సంతోషము
(2)       ||దివినేలు||

Video