దివ్య తార
Divya Thaara
UncategorizedAdded on 1/2/2019
Lyrics
గుడేటి పురుషోత్తం బాబు వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2) ||దివ్య|| జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం మధురమైన పాటలతో మారుమ్రోగెను క్రీస్తు జన్మమే పరమ మర్మమే కారు చీకట్లో అరుణోదయమే తార తార క్రిస్మస్ తార తార తార దివ్య తార (2) ||దివ్య|| ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది అవనిలో క్రీస్తు శకము అవతరించినది క్రీస్తు జన్మమే మధురమాయెనే శాంతి లేని జీవితాన కాంతి పుంజమే తార తార క్రిస్మస్ తార తార తార దివ్య తార (2) ||దివ్య|| పాపలోక జీవితం – పటాపంచలైనది నీతియై లోకంలో వికసించినది క్రీస్తు జన్మమే ప్రేమామయమే చీకటి హృదయాలలో వెలుగు తేజమే తార తార క్రిస్మస్ తార తార తార దివ్య తార (2) ||దివ్య||