దూత పాట పాడుడి
Dootha Paata Paadudi
Lyricistచార్లెస్ వెస్లీ
UncategorizedAdded on 11/8/2014
Lyrics
అనువదించినది: జే ఈ ఫాడ్ ఫీల్డ్ దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు అంత్య కాలమందున – కన్య గర్భమందున బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి