దొరకును సమస్తము

Dorakunu Samasthamu

UncategorizedAdded on 10/27/2016

Lyrics

Ch Solmon Raju
దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత
యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా
||దొరకును||
మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి
పాదాలను ముద్దు పెట్టుకొని
పూసెను విలువైన అత్తరు
చేసెను శ్రేష్టారాధన
దొరికెను పాప క్షమాపణ
(2)            ||దొరకును||
యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి
బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి
చిన్నదాన లెమ్మని చెప్పి
బ్రతికించెను యేసు దేవుడు
కలిగెను మహదానందం
దొరికెను రక్షణ భాగ్యము
(2)            ||దొరకును||
పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి
పాదాలపై పడెను పరవశుడై యుండెను
పరలోక దర్శనం
చూచెను తానే స్వయముగా
దొరికెను ప్రభు ముఖ దర్శనం
దొరికెను ఇల మహా భాగ్యం
(2)            ||దొరకును||

Video