ఎబినేజరే

Ebinaejarae

Lyricistజాన్ జెబరాజ్
UncategorizedAdded on 4/16/2023

Lyrics

అనువదించినది:
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం
||నేను||
ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం
(2)       ||ఎబినేజరే||
నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి
(2)       ||ఎబినేజరే||
జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం
(2)       ||ఎబినేజరే||

Video