ఎడబాయని నీ కృప

Edabaayani Nee Krupa

Lyricistమాథ్యూస్
UncategorizedAdded on 5/4/2020

Lyrics

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం
(2)      ||ఎడబాయని||
శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగా
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి
(2)      ||ఎడబాయని||
విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగా
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి
(2)      ||ఎడబాయని||
నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి
(2)      ||ఎడబాయని||

Video