ఎడబాయని నీదు కృప

Edabaayani Needu Krupa

Lyricistదీవెనయ్య
UncategorizedAdded on 7/19/2016

Lyrics

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ
నన్నెంతగానో బలపరచెను
నన్నెంతగానో స్థిరపరచెను
నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను
నన్నెంతగానో స్థిరపరచెను
(2)        ||ఎడబాయని||
కన్నీటి లోయలలో నుండి
నన్ను దాటించిన దేవా
సింహాల బోనులలో నుండి
నన్ను విడిపించిన ప్రభువా
(2)       ||నన్ను బలపరచెను||
నేనున్నతమైన స్థితిలో
ఉండాలని ఆశించితివా
ఏ అర్హత నాకు లేకున్నా
నా కృప నీకు చాలునంటివే
(2)       ||నన్ను బలపరచెను||
నేనెదుర్కొనలేని పరిస్థితులు
నా ఎదుట ఉన్నవి దేవా
నీ శక్తిని నేను కోరెదను
నన్ను విడిపించు నా దేవా
(2)       ||నన్ను బలపరచెను||

Video