ఈ దినం క్రీస్తు జన్మ దినం

Ee Dinm Kreesthu Janma Dinm

Lyricistకృపాదాస్ కొల్లాటి
UncategorizedAdded on 12/19/2017

Lyrics

ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో
(2)        ||ఈ దినం||
దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం
||ఆడుము||
పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము
||ఈ దినం||

Video