ఈ జీవితం విలువైనది

Ee Jeevithm Viluvainadi

Lyricistసత్యవేద సాగర్
UncategorizedAdded on 9/1/2017

Lyrics

ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు
||ఈ జీవితం||
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు
పోతున్నవారిని నువు చుచుటలేదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా
(2)    ||ఈ జీవితం||
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి
(2)    ||ఈ జీవితం||
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు
(2)    ||ఈ జీవితం||

Video