ఈ సాయంకాలమున
Ee Saaymkaalamuna
Lyricistమల్లెల దావీదు
UncategorizedAdded on 6/7/2022
Lyrics
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు ||ఈ సాయంకాలమున|| చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ ||ఈ సాయంకాలమున|| దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు ||ఈ సాయంకాలమున|| నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా ||ఈ సాయంకాలమున|| జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్ ||ఈ సాయంకాలమున||