ఈ ఉదయమున
Ee Udayamuna
UncategorizedAdded on 2/17/2023
Lyrics
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2) ||ఈ ఉదయమున|| తోడు లేని జీవ యాత్ర చేరలేని కడలి తీరం బ్రతుకే బరువై పోవగా క్రీస్తు దరికి సాగి రమ్ము చేరుకొనుము తీరము ||ఈ ఉదయమున|| అలల వలె వ్యధలు రాగా కనుల నీరే తోడు కాగా అండగా క్రీస్తేసుడుండ చింత ఏల భీతి ఏల బంధాలెల్ల వీడెగా ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం –