ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
Ekkado Manasu Vellipoyimdi
Lyricistప్రసన్న బెన్హర్
UncategorizedAdded on 5/10/2017
Lyrics
ఎక్కడో మనసు వెళ్ళిపోయింది ఏమిటో ఇటు రానే రానంది ఆహాహా.. ఓహోహో… నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది అక్కడే చిక్కుకుపోయానంటుంది బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2) ||ఎక్కడో|| జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది దేనికీ ఇక చోటే లేదంది యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2) ||ఎక్కడో|| ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది అక్కడే కరిగిపోతానంటుంది ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2) ||ఎక్కడో||