ఎల్ షమా

El Shamaa

Lyricistజెస్సి పాల్
UncategorizedAdded on 1/19/2025

Lyrics

దేవా చెవియొగ్గుము.. దృష్టించుము.. నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యుము.. బదులీయము.. నిన్నే వేడుచున్నాను
ప్రతి ఉదయం – నిను నమ్మి
ప్రతి రాత్రి – నిను వేడి
ప్రతి ఘడియ – నిను కోరి.. నహాళ్
ఆశతో వేచి ఉన్నా – నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్నా – నీవేగా నా ధైర్యం
ఎల్ షమా
నా ప్రార్ధన వినువాడా
ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను (
వేచి వేచి యున్నాను
నీ తట్టు నా కరముల్ నే చాపుచున్నాను
ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
ఆత్మ వర్షం కురిపించి నను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
||ఎల్ షమా||
విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను
అడుగడుగు నా తోడై ఒడ్డుకు నను చేర్చవా
యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా
(2)          ||ఎల్ షమా||
నీ శక్తియే విడిపించును
నీ హస్తమే లేవనెత్తును
నీ మాటయే నా బలము
నీ మార్గము పరిశుద్ధము
(2)          ||ఎల్ షమా||

Video