ఎలా మరువగలనయ్యా

Elaa Maruvagalanayyaa

UncategorizedAdded on 8/2/2017

Lyrics

డేవిడ్ రాజ్ రాయ్
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా విడువగలనయ్యా నీ సేవను
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
(2)       ||ఎలా మరువగలనయ్యా||
ఆత్మీయులే నన్ను ఆదరించలేదు
ప్రేమించువారే ప్రేమించలేదు
ఆదరించావు ప్రేమించావు
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు
(2)       ||ఎలా మరువగలనయ్యా||
బంధువులే నన్ను ద్వేషించినారు
సొంత తల్లిదండ్రులే వెలివేసినారు
చేరదీసావు సేదదీర్చావు
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు
(2)       ||ఎలా మరువగలనయ్యా||
అనాథగా నేను తిరుగుచున్నప్పుడు
ఆకలితో నేను అలమటించినప్పుడు
ఆదరించావు ఆకలి తీర్చావు
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు
(2)       ||ఎలా మరువగలనయ్యా||

Video