ఎల్లలు లేనిది

Ellalu Laenidi

Lyricistజాన్ వెస్లీ
UncategorizedAdded on 1/18/2017

Lyrics

ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది
అవధులు లేనిది – యేసుని ప్రేమ
నిశ్చలమైనది ఎన్నడు మారనిది
మాటే తప్పనిది – యేసుని ప్రేమ
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. నా యేసు ప్రేమా
(2)         ||ఎల్లలు||
జీవిత యాత్రలో నీ కలలో చెదరినా
జీవన పయనంలో అందరు విడచినా
విడువనిది మరువనిది
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా
||ఎల్లలు||
కల్వరి పయనంలో రక్తపు ధరలు
దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా
తరగనిది చెదరనిది
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా
||ఎల్లలు||

Video