ఎందుకో ఈ ప్రేమ

Emduko Ee Praema

UncategorizedAdded on 9/13/2017

Lyrics

ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను
ఏ యోగ్యత లేని ఓటి కుండను
నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి
ఎనలేని కృపనిచ్చితివి
||ఎందుకో||
నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే
అయినా నీవు క్షమియించినావే
ఊహించని మేలులతో దీవించినావే
నా సంకటములను కదా తీర్చినవే
ఏ యోగ్యత లేని దీనుడను
ఏమివ్వగలను నీ ప్రేమకు
(నా) సర్వం నీకే అర్పింతును
– (2)         ||ఎందుకో||
మా కొరకు బలి పశువై మరణించినావు
మా పాప శిక్ష తొలగించినావు
పలు విధముల శోధనలో తోడైనావు
ఏ కీడు రాకుండ మేము కాచినావు
రుచి చూపినావు నీ ప్రేమను
ఆ ప్రేమలో నేను జీవింతును
నీవే నాకు ఆధారము
– (2)         ||ఎందుకో||

Video