ఎందుకో నన్నింతగా నీవు
Emduko Nannimthagaa Neevu
UncategorizedAdded on 11/5/2013
Lyrics
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ||ఎందుకో|| నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో ||ఎందుకో|| నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు ||ఎందుకో|| నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే ||ఎందుకో|| నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ ||ఎందుకో||