ఎంత జాలి యేసువా
Emtha Jaali Yaesuvaa
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 8/8/2017
Lyrics
ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత|| హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ||ఎంత|| రక్షకుండ నాకు బదులు శిక్ష ననుభవించినావు సిలువయందు సొమ్మసిల్లి చావొందితివి నాకై ||ఎంత|| ఏమి నీ కర్పించగలను ఏమి లేమి వాడనయ్యా రక్షణంపు పాత్రనెత్తి స్తొత్రమంచు పాడెద ||ఎంత|| నీదు నామమునకు యిలలో భయపడెడు వారి కొరకై నాథుడా నీ విచ్చు మేలు ఎంత గొప్పదేసువా ||ఎంత|| నేను బ్రతుకు దినములన్ని క్షేమమెల్ల వేళలందు నిశ్చయముగ నీవు నాకు ఇచ్చువాడా ప్రభువా ||ఎంత|| నాదు ప్రాణమునకు ప్రభువా సేద దీర్చు వాడ వీవు నాదు కాపరివి నీవు నాకు లేమి లేదుగా ||ఎంత|| అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయ స్తోత్రములను హర్షముతో పాడెద ||ఎంత||