ఎంత మంచి దేవుడవయ్యా

Emtha Mmchi Daevudavayyaa

Lyricistదియ్యా ప్రసాదరావు
UncategorizedAdded on 2/3/2015

Lyrics

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ
జగమంతా వెదికాను జనులందరినడిగాను
చివరికది నీలోనే కనుగొన్నాను
||ఎంత మంచి||
ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను
చివరికది నీలోనే కనుగొన్నాను
||ఎంత మంచి||
సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ
ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను
చివరికది నీలోనే కనుగొన్నాను
||ఎంత మంచి||

Video