ఎంత పెద్ద పోరాటమో
Emtha Pedda Poraatamo
Lyricistప్రసన్న బెన్హర్
UncategorizedAdded on 9/20/2016
Lyrics
ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో పోరాడతాను నిత్యము విజయమనేది తథ్యము వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి విశ్వాసమనే డాలుని చేత పట్టి ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవాదే యుద్ధమనుచు ప్రార్థన యుద్ధములో కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కి పెట్టి ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవా నిస్సీ అనుచు యేసు కాడిని భుజమున పెట్టి వాగ్ధాన తలుపు విసుగక తట్టి ముందుకే దూసుకెళ్లెదన్ సిలువలో సమాప్తమైనదనుచు