ఎంత ప్రేమో నాపై

Emtha Praemo Naapai

Lyricistదీవెనయ్య
UncategorizedAdded on 3/15/2018

Lyrics

ఎంత ప్రేమో నాపై యేసయ్యా
నేను ఎలాగ వివరించగలనయ్యా
పెంట కుప్పలలో పడి ఉన్ననూ
నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా
జిగట ఊబిలో నేను దిగి ఉన్ననూ
నా చేయి పట్టి నను పైకి లేపితివా
||ఎంత||
దాహం తీర్చగలేని బావి అయిననూ
నేను పాపపు కుండను విడువకుంటిని
నా పాపమంత క్షమించితివి
జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి
పందులున్న చోట నలిగి పడి ఉంటిని
నా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది
బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా
క్షమియించి నీ రక్షణిచ్చితివి
నరికిన కొమ్మ వలె ఎండిపోతిని
నా పాపాన్ని దాచి దాచి నశించితిని
ఒప్పుకొనగా నాకు జీవమిచ్చితివి
(ఎండిన) మొద్దును చిగురింపజేసితివి

Video