ఎంతటి వాడను నేను
Emthati Vaadanu Naenu
Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 5/4/2016
Lyrics
ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా ఇంతగ నను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవీవే హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు ||ఎంతటి|| నిను వెంబడించువారిని నిజముగ సేవించువారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదవు ఆశీర్వదించెదవు శత్రువుల కంటె ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి|| వినయముగల మనుష్యులను వర్దిల్లజేసెదవు గర్విష్టుల గర్వమునణచి గద్దె నుండి దించెదవు మాదు ఆశ్రయ దుర్గమా మేమంతా నీ వారమే మా శైలము మా కేడెమా మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||