ఎంతెంత భారమాయె

Emthemtha Bhaaramaaye

Lyricistసాయరాం గట్టు
UncategorizedAdded on 5/14/2016

Lyrics

ఎంతెంత భారమాయె ఆ సిలువ
లోక పాపములన్ని నువ్వు గెలువ
కదిలినావు ఆ కల్వరికి
మరణముని దరి చేర్చుకొని
యేసయ్యా… నా యేసయ్యా…
అలసిపోతివ నా యేసయ్యా…
కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను
పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను
వడి ముళ్ళు తలలోన నాటేను
నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను
(2)           ||యేసయ్యా||
బరువైన సిలువను మోయలేక
తడబడె నీ అడుగు అదిరిపడి
వడివడిగా నిన్ను నడువుమని
పడి పడి తన్నిరి ఆ పాపులు
(2)      ||యేసయ్యా||
చల్లని నీ దేహమల్లాడెను
ఏ చోటు లేకుండ గాయాలతో
కాళ్ళు చేతులకు దిగి మేకులు
వ్రేళాడే సిలువకు నీ ప్రాణము
(2)        ||యేసయ్యా||
వెలలేనిది తండ్రి నీ త్యాగము
నీ కష్టమంతయు నా పాపము
మదిలోన కొలువుండు నా రక్షకా
వదిలేది లేదు నిన్ను నా పాలిక
(2)            ||యేసయ్యా||

Video