ఎంతో సుందరుడమ్మ తాను
Emtho Sumdarudamma Thaanu
UncategorizedAdded on 8/26/2017
Lyrics
ఎం ప్రశాంత్ రాజు ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు అవలీలగా నతని గురితింపగలనమ్మా కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు – సిరులు కురిపించేను వర దేవ తనయుండు విరబూయు పరలోక షారోను విరజాజి పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు – కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు మేలిమి బంగారు స్థలమందు నిలిపిన చలువ రాతిని బోలు బలమైన పాదాలు మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు – ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. బలవంతుడగువాడు బహుప్రియుడాతండు అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – ఆతని నొరతి మధురంబు మధురంబు ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస