ఎనలేని ప్రేమ

Enalaeni Praema

Lyricistసృజిత్ మనూక
UncategorizedAdded on 6/1/2018

Lyrics

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నరునిగా వచ్చిన నా దేవా
నా పాపము కొరకు రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవా
ఊహించగలనా వర్ణింప తగునా
ఆ గొప్ప సిల్వ త్యాగము
ఆ గొప్ప సిల్వ త్యాగము
||ఎనలేని||
కొరడాలతో హింసించినా
మోముపై ఉమ్మి వేసినా
చెమట రక్తముగా మారినా
(2)          ||ఊహించగలనా||
ముళ్ల కిరీటముతో మొత్తినా
బల్లెముతో ప్రక్క పొడచినా
పరలోక తండ్రియే చేయి విడచినా
(2)          ||ఊహించగలనా||

Video