ఎన్ని తలచినా
Enni Thalachinaa
UncategorizedAdded on 11/5/2013
Lyrics
జరిగేది నీ చిత్తమే ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు అడవి పూవులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి లోకమంతయూ నన్ను విడచినా నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నీదు యాగమే నా మోక్ష మార్గము నీయందే నిత్యజీవము ప్రభువా ||ఎన్ని||