ఎన్నిక లేని నాపై

Ennika Laeni Naapai

Lyricistశోభా రాణి
UncategorizedAdded on 12/15/2019

Lyrics

ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు
ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు
నీకే నీకే నీకే పాదాభివందనము
నీకే నీకే నీకే స్తోత్రాభివందనము
||ఎన్నిక||
బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు
ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను
పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు
ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను

Video