ఎట్టి వాడో యేసు

Etti Vaado Yaesu

Lyricistగోడి సామ్యూల్
UncategorizedAdded on 11/15/2017

Lyrics

ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని –
(2)      ||ఎట్టి||
గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు
హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే
(2)      ||ఎట్టి||
పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా
పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె
(2)      ||ఎట్టి||
పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం
కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం
(2)      ||ఎట్టి||

Video