ఎటు చూచినా
Etu Choochinaa
UncategorizedAdded on 4/13/2017
Lyrics
ఎటు చూచినా కరువూ భూకంపాలు ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఓ సోదరా ఓ సోదరీ రాకడ గురుతులని తెలుసుకోవా తినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు|| మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ యోవాబుని సేవకులు దండులో నుండగను తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు ఇది సమయమా.. ఇది సమయమా.. అని ఆనాడు ఊరియా దావీదునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము పాడైపోయెను పాడైపోయెను యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు ||ఎటు||