ఎవరి కోసమో

Evari Kosamo

UncategorizedAdded on 10/13/2016

Lyrics

నీ కోసమే నా కోసమే
కలువరి పయనం – ఈ కలువరి పయనం
ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా….
||ఎవరి||
జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
వీరిని క్షమించు, వీరిని క్షమించు
అని వేడుకొన్నావా… పరమ తండ్రిని
||ఎవరి||

Video