ఎవరో తెలుసా యేసయ్యా
Evaro Thelusaa Yaesayyaa
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 10/12/2016
Lyrics
ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై ధనవంతుడై యుండి యేసయ్యా దరిద్రుడై ఇల పుట్టాడయ్యా రూపు రేఖలు కోల్పోయాడు నీ నా పాపవిమోచనకై పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై తన దరి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తముతో యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా నమ్మినవారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా యేసుని తరుపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై అతి వినయముగా బతిమాలుచున్నాను నేడే నమ్ముము ప్రభు యేసుని