ఎవరూ సమీపించలేని
Evaroo Sameepimchalaeni
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 2/28/2017
Lyrics
ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||